బాబు 'హెరిటేజ్'ని టార్గెట్ చేసిన జగన్ పార్టీ, వివరణ

అక్కడ పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కరవైందని విమర్శించారు. హెరిటేజ్ పాలను కేరళలో నిషేధించారని, మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. హెరిటేజ్ పాల తయారీపై తక్షణమే విచారణ జరిపించాలని, నిజ నిర్ధారణ కమిటీ వేసి చర్చించాలని జూపూడి డిమాండ్ చేశారు. దీనిని బట్టే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ఈగ వాలకుండా ప్రభుత్వం కాపలా కాస్తోందని అర్థమవుతోందన్నారు.
స్పందించిన హెరిటేజ్
కేరళలో హెరిటేజ్ పాల పైన ఎలాంటి నిషేధం లేదని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. జూపూడి ప్రభాకర రావును ఆ సంస్థ ఖండించింది. నాణ్యతకు మారుపేరుగా రెండు దశాబ్దాలకు పైగా పాలవిక్రయం చేస్తున్న హెరిటేజ్‌పై రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తగదని సంస్థ అధ్యక్షుడు జూపూడికి లేఖ రాశారు. నాణ్యతలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న తమ సంస్థకు ఐఎస్‌వో 22000 సర్టిఫికెట్ ఉందన్నారు.
2012లో 'హెరిటేజ్ పద్మనాభ' పేరుతో కేరళ మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు అక్కడి ఆహార భద్రత కమిషనర్ అప్పట్లో 30 రోజుల తాత్కాలిక బ్యాన్ విధించినట్టు తెలిపారు. అనంతరం అధికారులు టోన్డ్‌మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, స్టాండరైజ్‌డ్ మిల్క్ నమూనాలు తీసుకెళ్లి హెరిటేజ్ పాలల్లో ఫార్మలిన్ లేదని ద్రువీకరణ పత్రం ఇచ్చారని సాంబశివరావు తన లేఖలో వివరించారు. సంబంధిత సర్టిఫికెట్ కాపీని దానికి జతచేశారు.












Click it and Unblock the Notifications