మమతను దువ్వుతున్న మోడీ!: కేంద్రంపై నిప్పులు

ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు ఢిల్లీ ఏజెంట్లుగా మారిపోయారని మండిపడ్డారు. విద్యుత్ కొరత నుండి గుజరాత్ ఇప్పుడు మిగులును సాధించే స్థితికి చేరుకుందన్నారు. పర్యాటక పరిశ్రమ రెండింతలయ్యిందన్నారు. దేశంలో విద్యుత్ కొరతకు కేంద్రమే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా అంధకారంలో ముంచేసిందన్నారు.
విదేశాంగ విధానంపై అసంతృప్తి
నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. విదేశాంగ విధానంలో దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఉండాలన్నారు. సార్క్ దేశాలకు కూడా నాయకత్వ స్థితిలో భారత్ ఇప్పుడు లేదన్నారు. విదేశాంగ విధానంలో భారత్ చాలా వెనుకబడిందని నరేంద్ర మోడీ చెప్పారు.
మమతకు కితాబు!
2014 ఎన్డీయే ప్రధాని అభ్యర్థి రేసులో అందరికంటే ముందున్న మోడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని తమ వైపుకు రప్పించుకునేలా ప్రసంగం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై మాట్లాడుతూ.. లోపభూయిష్ట పాలన కారణంగా బెంగాల్ 32 ఏళ్లు అవస్థపడిందన్నారు. ఇప్పుడు బెంగాల్‌కు చాలా మంచి రోజులు వచ్చాయని అన్నారు.












Click it and Unblock the Notifications