185కే నిత్యావసరాలు: అమ్మహస్తం ప్రారంభించిన కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తెల్లకార్డుదారులకు దాదాపు రూ.300 విలువల గల నిత్యావసర వస్తువులను రూ.185కే ప్రభుత్వం ఇస్తుంది. ఉప్పు, చింతపండు, కందిపప్పు, గోధుమపిండి, చక్కెర తదితర తొమ్మిది వస్తువులను ఈ పథకం కింద ఇవ్వనున్నారు.

ఈ రోజు ముఖ్యమంత్రి దీనిని ప్రారంభించారు. తెల్లకార్డుదారులకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రవీంధ్రభారతిలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయనతో పాటు మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్, సిఎంలకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆహ్వానం అందింది. భద్రాచలంలో ఈ నెల 19న సీతారాముల కల్యాణం, 20న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. దీనికి వారిని ఆలయ అర్చకులు ఆహ్వానం అందించారు.

పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జరుపుకున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి తదితర పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు జరిగాయి. ఆయా పార్టీ కార్యాలయాల్లో జరిగిన ఉగాది వేడుకలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+