సబిత ఇంటికెళ్లవచ్చు, కిరణ్ దానకర్ణుడి ఫోజులు: బాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానకర్ణుడిలా ఫోజులిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఏడాదిలో కాంగ్రెసు ప్రభుత్వం పథకాల పేరుతో జిమ్మిక్కులు చేస్తోందన్నారు. మరోసారి కాంగ్రెసు పార్టీని నమ్మితే ఇళ్ల పైన కప్పులను కూడా అమ్ముకోవాల్సి ఉంటుందన్నారు.
అమ్మహస్తం ఓ దండుగ పథకం అన్నారు. అది అమ్మహస్తం కాదని మొండి హస్తం అన్నారు. పేదలపై ఛార్జీల పేరుతో, పన్నుల రూపంలో భారం వేస్తూ భారీగా దండుకుంటున్న ప్రభుత్వం రూ.185కు తొమ్మిది సరుకులు ఇస్తామనడం దారుణమన్నారు. పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
విద్యుత్‌ను సక్రమంగా ఇవ్వలేని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడలేని హోమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వెళ్లవచ్చునన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications