యువతిపై ఘోరం: మరోచోట అమ్మేసి, కళ్లు పీకిన భర్త

నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. యువతి తన బావతో కలిసి పొరుగూరు నుండి వస్తుండగా దారిలో దుండగులు అటకాయించారు. బావను కొట్టి, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో రాజకీయ నాయకుడు ఉండటంతో రాజకీయంగాను చర్చనీయాంశమైంది.
బంగ్లాలో కళ్లు పీకేసిన భర్త
మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళకు ఆమె భర్త కళ్లు పీకేసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. మల్దా పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మహిళ, తన భర్తతో కలిసి బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు.
ఆమెను భర్త దక్షిణ దినాజ్ పుర్ జిల్లా గంగాపుర్‌లలో ఒక వ్యక్తికి అమ్మేశాడు. ఇది తెలిసిన ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. గత రాత్రి ఆమె భర్త ఆమె కళ్లు పీకేసి పారిపోయాడు. బుధవారం బాధతో విలవిలలాడుతున్న ఆమెను గమనించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications