హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ ఇవ్వదు-తెరాస తేదు: ఓయులో పోస్టర్ల కలకలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టర్ల కలకలం చెలరేగింది. తెలంగాణ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేరిట విశ్వవిద్యాలయంలో పోస్టర్లు వెళిశాయి. అందులో అధికార కాంగ్రెసు పార్టీతో పాటు తెలంగాణ కోసం పాటుపడుతున్నామని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పైన విమర్సలు గుప్పించారు.

ఓట్లు, సీట్లతో తెలంగాణ రాదని మిలిటెంట్ ఉద్యమాలతోనే సాధ్యమమని ఆ పోస్టర్‌లలో పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను ఇస్తానన్న అధికార కాంగ్రెసు పార్టీ ఇవ్వలేదని, అలాగే తెస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి తేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానమైన అడ్డంకి సీమాంధ్ర పార్టీలేనని విమర్శించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వంటి సీమాంధ్ర పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డుకుంటున్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సైన్యం నిర్మాణం చేద్దామని, ప్రజాస్వామిక తెలంగాణను సాధించుతామని అందులో పిలుపునిచ్చారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్మూలిద్దామని, మన భూములను మనమే సాగు చేసుకుందామని, నాయకుల్లారా! ప్రజా యుద్ధం మొదలైందని, ఆలోచించాలని అందులో హెచ్చరించారు. అందరం కలిసి ప్రజాస్వామిక తెలంగాణ తెలంగాణను సాధించుకుందామన్నారు.

English summary
Osmania University, the hotbed of Telangana agitation for the last few years but relatively peaceful now, received a jolt with posters appearing in the hostels asking students to take up armed struggle to realize their dream of a separate Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X