హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉంటే జగన్‌కు ఉరే: ఆనం, వెలి వారికే: మేకపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy-Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇద్దరు నేతలు కూడా నెల్లూరు జిల్లాకు చెందినవారే కావడం విశేషం. అవినీతికి ఉరిశిక్ష అనేది ఉంటే అది మొదట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కే వేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వైయస్సార్ కుటుంబాన్ని వెలి వేయాలని ఆయన అన్నారు.

అన్న జగన్ డబ్బులు ఎక్కడ దాచాడో తెలుసుకోవడానికి షర్మిల గల్లిగల్లీ తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను జైలు నుంచి బయటకు తీసుకు రావడానికి వైయస్ విజయమ్మ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ బయ్యారం గనుల కోసం ఐదు మండలాలను నాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. భూకబ్జా కోసం అనిల్ కుమార్ పేదల గుడిసెలను తొలగించారని ఆయన అన్నారు.

ఆనం రామనారాయణ రెడ్డిపై మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఎవరిని వెలివేస్తారో ఆరు నెలల్లో తేలిపోతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నాీరు. మతి భ్రమించి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆనం సోదరులకు వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ భిక్ష ప్రసాదించారని ఆయన చెప్పారు. వైయస్ సంతాప సభలో ఆనం కన్నీరు పెట్టుకున్నారని ఆయన చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అవకాశం ఇవ్వబట్టే ఆనం ఎదిగారని ఆయన చెప్పారు. వైయస్ విజయమ్మపై, షర్మిలపై ఆనం వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఢిల్లీ ఆశీస్సుల కోసం ఆనం రామనారాయణ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆనాడు ఆనం అన్నారని ఆయన గుర్తు చేశారు. జగన్ 60 అడుగుల కటౌట్ పెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ఆయన అన్నారు.

ఆ రోజు జగన్‌ను ప్రశంసించి, ఈ రోజు విమర్శించడం ఏమిటని, జగన్‌ను శాశ్వతంగా జైల్లో ఉంచాలని అనుకుంటున్నారా అని ఆయన అడిగారు. రాజకీయ లబ్ధి కోసమే ఆనం ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఆనం సోదరులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.

బయ్యారం గనులతో తనకు సంబంధం లేదని బ్రదర్ అనిల్ ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు. ఆనం సొంత సోదరుడు జయకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు ాపర్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

English summary
Retaliating finance minister Anam Ramanarayana Reddy's comments on YSR Congress president YS Jagan, Nellore MP Mekapati Rajamohan Reddy said that the former supported YS Jagan earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X