పబ్‌లో తప్పతాగి అర్ధరాత్రి రోడ్డుపై అమ్మాయిల వీరంగం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో పలువురు యువతులు తప్పతాగి వీరంగం సృష్టించారు. బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో యువతులు తప్ప తాగారు. అనంతరం అర్ధరాత్రి నడి రోడ్డు పైకి వచ్చి హల్ చల్ చేశారు. వాటిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులతోను దురుసుగా ప్రవర్తించారు. రోడ్డుపై ఇదేంటని ప్రశ్నిస్తే చిందులు తొక్కి తిట్ల పురాణం అందుకున్నారు.
వారికి పలువురు యువకులు కూడా తోడయ్యారు. వారి హంగామాను, గొడవను చిత్రీకరిస్తున్న విలేకరి వద్ద గల కెమెరాను లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. రోడ్డున పోయే వారి పైన కూడా దాడులకు పాల్పడ్డారు. విలేకరి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

భార్య గొంతు కోసిన భర్త
కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భర్తే భార్యపై దాడి చేసి ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా సికె పల్లి మండలం పెనుగొండవారి గ్రామంలో జరిగింది. ఇది గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పాతకక్షలతో ఒకరి మృతి!
కడప జిల్లాలోని గంగాదేవిపల్లెలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications