వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్‌‌ది అబద్ధం, చెంపపై భజ్జీ కొట్టాడు: నానావతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth-Harbhajan
న్యూఢిల్లీ: పేసర్ శ్రీశాంత్‌ను స్నిన్నర్ చెంపపై కొట్టాడని రిటైర్డ్ న్యాయమూర్తి సుధీర్ నానావతి అన్నారు. తనను హర్భజన్ కొట్టలేదని, మోచేతితో కొట్టాడని శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యను నానావతి ఖండించారు. 2008 ఐపియల్ స్లాప్‌గేట్ ఘటనపై నానావతి విచారణ జరిపారు. ఈ సంఘటనపై విచారణకు బిసిసిఐ నానావతిని నియమించింది.

శ్రీశాంత్ ఏ విధమైన రెచ్చగొట్టే పనిచేయలేదని, హర్భజన్ రెండోసారి శ్రీశాంత్ చెంపపై దెబ్బ వేయడానికి ప్రయత్నించాడని, అయితే సెక్యూరిటీ గార్డులు ఆపారని నానావతి అన్నారు. శ్రీశాంత్ ముఖం కుడి పక్కన దెబ్బ వేయడానికి హర్భజన్ కుడి అరచేయి వెనకభాగాన్ని వాడినట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించిందని చెప్పారు. అది స్పష్టంగా ఉందని, వీడియో ఫుటేజ్‌లో దాన్ని చూడవచ్చునని చెప్పారు.

తాను కొట్టినట్లు హర్భజన్ తన ముందు అంగీకరించాడని, వీడియో ఫుటేజ్‌ని చూసిన తర్వాత తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆశ్చర్యపోయానని అన్నారు. ఒక్కసారి కొట్టిన తర్వాత తిరిగి మరోసారి కొట్టడానికి వెనక్కి వస్తున్న దృశ్యం, హర్బజన్‌ను ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆపుతున్న దృశ్యం వీడియోలో రికార్డయిందని నానావతి చెప్పారు. టైమ్స్ నౌ‌తో నానావతి ఆ విషయాలు చెప్పారు.

ఐదేళ్ల తర్వాత ఆ సంఘటనపై ట్వీట్ చేస్తూ శ్రీశాంత్ మరోసారి వివాదాన్ని సృష్టించాడు. ఆ సంఘటనలో తన తప్పేమీ లేదని ఆయన చెప్పాడు. హర్భజన్‌ను వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా అతను అభివర్ణించాడు. అప్పుడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించలేదని నానావతి చెప్పారు.

తాను ప్రస్తుతం చెబుతున్న విషయాలను తాను నివేదికలో పొందుపరిచానని, నివేదిక ఇప్పటికీ తన వద్ద ఉందని, మరో ప్రతి బిసిసిఐ వద్ద ఉందని నానావతి చెప్పారు. శ్రీశాంత్ రెచ్చగొట్టే విధంగా ఏమైనా ప్రవర్తించాడా అనే విషయంపై తాను విచారణ జరిపానని చెప్పారు.

English summary
Justice (retd) Sudhir Nanavati, who headed the 'slapgate' inquiry, on Friday contradicted S Sreesanth's claim that he was elbowed by Harbhajan Singh in the 2008 IPL incident, saying the pacer was indeed slapped by his then India teammate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X