వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో సిద్దూ భార్య సంచలన వ్యాఖ్య: బిజెపికి చిక్కు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Navjot Singh Sidhu-Navjot Kaur
అమృత్‌సర్: తన భర్తను పార్టీ పక్కన పెట్టిందని, గౌరవం లేనిచోట ఉండటం కష్టమని మాజీ క్రికెటర్, అమృత్‌సర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సతీమణి, అమృత్‌సర్ శాసన సభ్యురాలు కౌర్ మండిపడ్డారు. ఆమె సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

టివి ప్రదర్శనలు, ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగి... నియోజకవర్గ ప్రజలను తన భర్త పట్టించుకోవడం లేదని అనడంలో అర్థం లేదన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం కోసం సిద్దూ టివి షోలను రద్దు చేసుకున్నారని, పార్టీ చిన్న చూపు చూస్తోందని, అందుకే ఆయన ఈ మధ్య ఆయా కార్యక్రమాలలో పాల్గొంటున్నారని అన్నారు.

కుటుంబంతో కూడా గడపకుండా ప్రజల కోసం కష్టపడుతున్న ఆయనకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. తనకు గౌరవం లభించే పాత వృత్తిలోకే సిద్దూ వెళ్తున్నారన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో తన భర్త అమృత్‌సర్ నుండే పోటీ చేయనున్నారని ఆమె చెప్పారు.

బిజెపికి చిక్కులు

సిద్దూ సతీమణి కౌర్ ఫేస్ బుక్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. ఈ వ్యాఖ్యలతో బిజెపి అధిష్టానం ఇరుకున పడింది. వచ్చే ఎన్నికల్లో అమృత్‌సర్ నుండి పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇక్కడ నుండి సిద్దూ మూడుసార్లు గెలుపొందారు.

సిద్దూ సతీమణి కౌర్ 2012 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అమృత్‌సర్ నుండి జైట్లీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఆ కారణంగానే సిద్దూను పక్కకు తప్పించాలని పలువురు చూస్తున్నారని అంటున్నారు. అయితే, బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను జాతీయ ప్రధాన కార్యదర్శి జెపి నడ్డా పైన ఉంచింది.

English summary
Former Indian cricketer Navjot Singh Sidhu, whose wife recently is believed to have irked BJP leaders after revealing party information in public, might be replaced by senior party leader Arun Jaitley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X