హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కేసులో నాగార్జున నిందితుడే: టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagarjuna
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సినీ హీరో నాగార్జున నిందితుడేనని తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నాగార్జున అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ డిమాండ్ చేశారు.

పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున మధ్య ఉమ్మడి వ్యాపార లావాదేవీలున్నాయనేది జగమెరిగిన సత్యమని ఆయన అన్నారు. అందుకే నిమ్మగడ్డ ప్రసాద్‌ను చూడాలనే సాకుతో మూడు నెలలకు ఒకసారి నాగార్జున చంచల్‌గుడా జైలుకు వెళ్లి జగన్‌ను కలిసి వస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని త్వరలోనే తాను సాక్ష్యాధారాలతో బయటపెడతానని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, రాష్ట్ర కాంగ్రెసులో, ప్రభుత్వంలో ఒక్క మగాడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డేనని ఆయన అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మాదిరిగానే మిగతా మంత్రులు, కాంగ్రెసు నాయకులు జగన్ కేసు వాస్తవాలను ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి చెప్తేనే సంతకాలు చేసి బలిపశువులమయ్యామని అంటున్న ఆరుగురు మంత్రులు ఇప్పటికైనా సిబిఐ ముందు అప్రూవర్లుగా మారాలని ఆయన సూచించారు.

English summary
Telugudesam leader Rajendra Prasad accused that hero Nagarjuna is accused in YSR Congress party president YS Jagan DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X