నరేంద్రమోడీకి నితీష్ నో, అద్వానీకి ఓకే: పోస్టర్ కలకలం

LK Advani - Nitish Kumar - Narendra Modi
న్యూఢిల్లీ: ఎన్టీయే ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పట్ల భాగస్వామ్య పార్టీ జెడి(యు) వ్యతిరేకించింది. బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ సహా ఏ ఇతర నేత అయినా తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. అదే సమయంలో ఎన్డీయేతో కాదని యూపిఏతో జట్టు కట్టబోమని తేల్చి చెప్పింది. 2002లో గుజరాత్ మత ఘర్షణలను నియంత్రించడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు.

తమ పార్టీ తొలి నుంచీ లౌకిక వాదానికి కట్టుబడి ఉందని, లౌకిక వాదినే ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తామని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అంటే, మోడీ ప్రధాని అభ్యర్థి అయితే జెడియూ కటీఫ్ తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని రాజకీయ పరిస్థితులను, ప్రధాని అభ్యర్థిగా మోడీని బిజెపి తెరపైకి తీసుకొస్తున్న తీరును కూలంకషంగా చర్చించారు. ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలంటూ బిజెపిని తాము డిమాండ్ చేయడం లేదని జెడి(యూ) ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు.

అయితే అద్వానీ నాయకత్వానికి తాము వ్యతిరేకం కాదన్నారు. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో బిజెపి విఫలమైందని విమర్శించారు. మోడీపై నితీశ్ విమర్శలు కేవలం కంటి తుడుపు మాత్రమేనని, బీజేపీతో తెగదెంపులు చేసుకునే ధైర్యం జెడి(యూ)కు లేదని ఆర్‌జెడి అధినేత లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు.

పోస్టర్ కలకలం

శనివారం ఢిల్లీలో జెడి(యు) జాతీయ కార్యవర్గ సదస్సు ప్రారంభమైంది. ఈ ప్రాంగణంలో భారీ పోస్టర్ వెలిసింది. అందులో రెండో మహాభారత యుద్ధం 2014 అని ఉంది. దాని కింద రెండు రథాలు, ఒకదానిపై అర్డునుడిగా విల్లంబులు ఎక్కుపెట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయనకు సారథిగా జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ ఉన్నారు. మరో రథంలో అర్జునుడిగా ప్రధాని, సారథిగా సోనియా ఉన్నారు. ఈ పోస్టరులో బిజెపి నేతలు లేరు. 2014లో ఢిల్లీ అధికార పీఠం కోసం జరిగే హోరాహోరీ పోరులో ప్రధాని మన్మోహన్‌తో ఢీకొనే సత్తా కలిగిన సరిజోడు నితీశ్ కుమార్ మాత్రమే అని సారాంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+