ఇద్దరు పిల్లలతో ఎన్నారై స్త్రీ అనుమానాస్పద మృతి

ఈ మరణాలకు కారణాలు వెంటనే తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, ఆ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలకు విషం ఇచ్చి చంపి ఆ తర్వాత హీనా కూడా విషం సేవించి మరణించి ఉంటుందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
మృతురాలి ఇంట్లోకి పోలీసులు రసాయన సూట్లు ధరించి ప్రవేశించడం, ఇళ్ల తలుపులను, కిటికీలను తెరవరాదని స్థానికులను ఆదేశించడం వంటివి చూస్తే విషవాయువు ప్రయోగం జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు స్యూట్‌కేసు, ట్యూబుల వంటివాటిని తీసుకుని వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో హీనా భర్త కల్పేష్ ఇంట్లో లేడు. హీనా 2002 వరకు దక్షిణ గుజరాత్ విశ్వవిద్యాలయంలో చదివినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications