జగన్‌ని ఎక్కువ రోజులు జైళ్లో ఉంచాలనే: కోర్టుకి లాయర్

ఈ సందర్భంగా సిబిఐ మరికొద్ది రోజుల్లో ఛార్జీషీట్లు దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఏడు అంశాల్లో పెండింగ్‌లో ఉన్న 4 అంశాలకు సంబంధించి దర్యాప్తు చురుగ్గా సాగుతోందని పేర్కొంది. ఈ మేరకు జగన్ రిమాండ్‌ని పొడిగించాలని కోరుతూ సిబిఐ మెమో దాఖలు చేసింది.
సాధ్యమైనంత ఎక్కువ కాలం జగన్‌ను జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే సిబిఐ వరుస చార్జిషీట్లను వేస్తోందని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ ఈ సందర్భంగా ఆరోపించారు. కేసును దీర్ఘకాలం నాన్చేందుకు సిబిఐ ప్రయత్నిస్తోందని, తనకు అనుకూలంగా ఉన్న అంశాలకు సుప్రీం కోర్టు తీర్పులను జోడిస్తోంది, అదే తీర్పులను నిందితులు పేర్కొంటే పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
అక్రమాస్తుల కేసులో ఇంకా ఎన్ని చార్జిషీట్లు వేస్తారని సిబిఐని ప్రశ్నించారు. తనపై అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ జగతి సంస్థ ఆడిటర్ విజయ సాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై డిఫెన్స్ తరఫున సుశీల్ కుమార్ వాదనలు వినిపించారు. జగన్ బెయిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో వాదనలు జరిగినపుడు మార్చి 31లోగా ఆఖరి చార్జిషీట్ వేయాలని కోర్టు పేర్కొందని గుర్తు చేశారు.
ఇంకా ముందే దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిఫెన్స్ కోరగా.. గడువు తేదీని తీర్పు కాపీలో రాయలేదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వేయాలని కోర్టు ఆదేశిస్తే... గడువేమీ లేదని సిబిఐ పేర్కొనడం ఆ ఆదేశాలను ఉల్లంఘించడమేనని వాదించారు. ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్‌కు ఒకే విచారణ జరుగుతుందని, ఇక్కడే భిన్నంగా ఉందన్నారు. ఒకవైపు దర్యాప్తు జరుగుతోందంటూనే అభియోగాల నమోదుకు సిద్ధమని సిబిఐ ఎలా చెబుతోందని ప్రశ్నించారు. సిబిఐ న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో విచారణ 24కు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications