నిబంధనల మేరకే జగన్ ములాఖత్‌లు: కృష్ణంరాజు

YS Jagan
నల్లగొండ: రాష్ట్ర జైళ్ల శాఖ నిబంధనల మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ములాఖత్‌లకు అనుమతిస్తున్నామని జైళ్ల శాఖ డిజి టి.కృష్ణంరాజు స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం ఆయన సబ్‌జైలు నిర్మాణాన్ని పరిశీలించారు. చంచల్‌గూడ జైలు నుంచి జగన్ పా ర్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

ములాఖత్ విషయంలో విఐపిలకు, రాజకీయ నేతలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, వాటి ఆధారంగానే జగన్‌తో మాట్లాడేందుకు ఆ పార్టీ నేతలకు అనుమతి ఇస్తున్నామన్నారు. విఐపిలకు, రాజకీయ నాయకులకు వారానికి నాలుగుసార్లు అవకాశం ఉంటుందని తెలిపారు. 15 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తామన్నారు.

కోర్టు అనుమతి, జైళ్ల శాఖ నిబంధనల మేరకు జగన్‌ను ఎవరైనా కలిసే అవకాశం ఉంటుందని, జైళ్ల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవవహరించడంలేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించి వైయస్ జగన్‌కు ములాఖత్‌లు ఇస్తున్నారని, చంచల్‌గుడా జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనుకునే నాయకులు జైలుకు వెళ్లి వైయస్ జగన్‌ను కలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ములాఖత్‌లన్నీ నిబంధనల మేరకే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+