జగన్ దొడ్డి దారిన కలిసేవారు!: జన్నత్ సాక్ష్యం కీలకం

వైయస్ రాజశేఖర రెడ్డి అధికారిక సమావేశాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కెవిపి రామచంద్ర రావు, విజయ సాయి రెడ్డిలు పాల్గొనే వారని జన్నత్ హుస్సేన్ తన వాంగ్మూలంలో సిబిఐకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. వైయస్ జగన్, సునీల్ రెడ్డిలు ప్రధాన దారి నుండి కాకుండా మరో మార్గం గుండా క్యాంప్ ఆఫీసుకు వచ్చే వారని తెలిపినట్లుగా చెబుతున్నారు.
నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి, పార్థసారథి రెడ్డి, కోనేరు ప్రసాద్, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు కూడా అదే దారిలో వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసేవారని తన వాంగ్మూలంలో పేర్కొన్నారట. సిబిఐ ఈ సాక్ష్యాన్ని తన ఛార్జీషీటులో పేర్కొన్నందున ఇది కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇప్పటికే ఈ ఛార్జీషీటులో వైయస్ వ్యక్తిగత కార్యదర్శి సూరీడు వాంగ్మూలాన్ని సిబిఐ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయాలను సూరీడు సిబిఐ విచారణలో వెల్లడించారట.












Click it and Unblock the Notifications