తొమ్మిదో తరగతి అమ్మాయికి టీచర్ లైంగిక వేధింపులు

తూర్పు గోదావరి జిల్లాలోని ఐ.పోలవరం మండలం జి.వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాసాగర్ అనే ఉపాధ్యాయుడు టీచర్‌గా పని చేస్తున్నాడు. అతను అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను తరుచూ లైంగికంగా వేధిస్తున్నాడు.
వారం రోజుల క్రితం పదవ తరగతి వీడ్కోలు పార్టీ జరిగింది. ఆ బాలికను సదరు టీచర్ ల్యాబ్ గదిలోకి తీసుకు వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకొని బయటపడింది. తరుచూ ఉపాధ్యాయుడి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది.
తల్లదండ్రులు, బంధువులు సోమవారం పాఠశాలకు వచ్చారు. ముందే గుర్తించిన సదరు టీచర్ అక్కడి నుండి పరారయ్యాడు. వారు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని శాంతపర్చారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధాయ్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ప్రాథమిక సమాచారం మేరకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని డిఈవో చెప్పారు. సంఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.












Click it and Unblock the Notifications