ఢిల్లీలో కంపించిన భూమి: ఇరాన్‌లో 40మంది మృతి

నోయిడాలోను భూమి కంపించింది. దాదాపు పది నుండి ఇరవై సెకన్ల మధ్య ఆయా ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా చెబుతున్నారు. రిక్టర్ స్కేలు పైన ఇది 5.6గా ఉంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో భవంతులు పడిపోతాయేమోనని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లుగా తెలియరాలేదు. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఛండీగఢ్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది. అధికారులు, ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
పాక్, ఇరాన్ దేశాల్లోను..
పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోను భూకంపం వచ్చింది. ఈ దేశాల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పైన 7.8గా ఉంది. భూకంప కేంద్రం పాకిస్తాన్ - ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఇరాన్ లోని ఖాష్‌లో పదిహేను కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్, గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, భారత్‌లపై భూకంప ప్రభావం పడింది.
ఇరాన్‌ను ఈ భారీ భూకంపం వణికించింది. ఖాష్ పట్టణంలో దాదాపు నలబై మంది వరకు మృతి చెందారని సమాచారం. వేలాది మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు భవంతులు కుప్పకూలాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. భూకంపం కారణంగా పాక్‌లో ఐదుగురు మృతి చెందారు.












Click it and Unblock the Notifications