అరుణ బస్‌పై తెరాస రాళ్ల దాడి: కెసిఆర్‌కు బిజెపి చురక

ఈ నేపథ్యంలో ఆమె బస్సు యాత్ర పానగల్‌కు ఈ రోజు చేరుకుంది. అక్కడ ఉద్రిక్తతత తలెత్తింది. అరుణ యాత్రను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. బస్సు పైన రాళ్లు రువ్వి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కెసిఆర్‌కు వెంకయ్య చురక
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చురకలు అంటించారు. తెరాసను ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కెసిఆర్ చెబుతున్నారని, బిజెపిని గెలిపిస్తే తెలంగాణే ఇస్తామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్న వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.
జాతీయ పార్టీలో కేంద్రంలో పాలిస్తాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని వదిలించుకోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీకి బిజెపియే ప్రత్యామ్నాయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి 200 స్థానాలలో గోలుస్తుందన్నారు. ఎపిలో బిజెపి బలం పెంచుకుంటుందన్నారు. తెలంగాణలో ప్రతి సీటులో తాము గట్టి పోటీదారులమే అన్నారు. త్వరలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. నిత్యం పార్టీలు మారే వారిని తాము తీసుకోమన్నారు.












Click it and Unblock the Notifications