కోమటిరెడ్డి సహా ఎంపీల కొత్త పల్లవి!: 'చేయి'చ్చేందుకే?

పాల్వాయిపై నిప్పులు
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండరని విమర్శించారు. అధిష్టానం తనకు అవకాశమిస్తే ఆలేరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తమపై పిచ్చి విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.
తెరాస ప్రజల పక్షం.. రాజయ్య
తాను ప్రజల పక్షమేనని, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రజల పక్షమేనని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య వరంగల్ జిల్లాలో అన్నారు. వరంగల్ ప్రజల ఆదేశం మేరకు తాను నడుచుకుంటానని చెప్పారు. బయ్యారం గనుల కేటాయింపులను రద్దు చేయాలని, తెలంగాణ ఖనిజ వనరులను సీమాంధ్రకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
అప్పుడు పార్టీ మారే ఆలోచన.. వివేక్
తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే తాను పార్టీ మారే విషయమై ఆలోచిస్తానని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని, తెలంగాణ మంత్రులు దీనిపై పోరాడాలని ఆయన సూచించారు. ఆయన అదిలాబాద్ జిల్లాలో ఈ రోజు మాట్లాడారు. 2014లోపు కాంగ్రెసు తెలంగాణపై తేల్చే అవకాశాలు లేవని, వీరి వ్యాఖ్యలను బట్టి వారు పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications