ఈవ్‌టీజర్స్ నుండి యువతిని కాపాడబోతే కాల్చేశారు

అలాంటి సంఘటనే నాగపూర్‌లో జరిగింది. తన స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని అడ్డుకోబోయిన స్నేహితుడిని దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని అడ్డుకొనేందుకు యత్నించిన 26 ఏళ్ల బిసిఏ విద్యార్థి రోషన్ సమ్రీత్ ప్రాణాలు కోల్పోయాడు.
రోషన్, అతని స్నేహితురాలు బైక్‌ప వెళుతుండగా, ఇద్దరు ఆగంతకులు వారిని అనుసరించారు. కాసేపటికి రోషన్ సమీపంలోని ఓ దుకాణం వద్దకు వెళ్లిన సమయంలో ఆగంతకులు ఆమెను సమీపించి అసభ్యకరంగా మాట్లాడారు. దీన్ని గమనించి రోషన్ వారిరువురితో ఘర్షణపడ్డాడు.
ఈ నేపథ్యంలో ఆగంతకుల్లో ఒకడు పిస్టల్ తీసి రోషన్ మెడపై కాల్పులు జరిపాడు. దీంతో అతన్ని సమీపంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగపూర్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications