సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

హైదరాబాద్: సబితా ఇంద్రారెడ్డి మంత్రిత్వ శాఖపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు మరో ఐదుగురు మంత్రులు కన్నేసినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేరు చేరడంతో సబితా ఇంద్రారెడ్డి నుంచి హోం శాఖ నుంచి మార్చవచ్చుననే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ శాఖపై ఇతర మంత్రులు కన్నేశారు. బొత్స సత్యనారాయణ హోం శాఖ కోసం పార్టీ అదిష్టానం వద్ద ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

బొత్సతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఆ శాఖ కోసం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన శుక్రవారం ఆంద్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి వద్ద హోం శాఖ ఉండడం సమంజసమని దామోదర రాజనర్సింహ ఆజాద్‌తో అన్నట్లు సమాచారం. మంత్రివర్గంలో తాను నెంబర్ టూ అని, అందువల్ల హోం శాఖ తన వద్ద ఉండడం సరైందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీగా ఉన్న పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా హోం శాఖ కావాలని అధిష్టానం పెద్దలను అడిగినట్లు తెలుస్తోంది. భారీ పరిశ్రమల మంత్రి జె. గీతా రెడ్డి వచ్చే వారం ఢిల్లీకి వెళ్లి హోం శాఖ కోసం ప్రయత్నాలు సాగించనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ ఆధారంగా తనకు హోంశాఖ ఇవ్వాలని ఆమె అడిగే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మహిళా మంత్రికే హోం శాఖను అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనకు సన్నిహితులైన మంత్రులకు ఆ శాఖను ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా, శిశు సంక్షేమ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఆ శాఖను అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆమెకు ఆ శాఖను అప్పగించడానికి ఇష్టపడకపోతే డికె అరుణను గానీ, శ్రీధర్ బాబును గానీ ఆ శాఖ కోసం ముందుకు తోసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

సునీతా లక్ష్మారెడ్డి లేదా డికె అరుణలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా వీరిద్దరే ఉన్నట్లు చెబుతున్నారు. వారిద్దరు మహిళలు కావడం, పైగా తెలంగాణకు చెందినవారు కావడం కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు.

సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. విధులు కూడా నిర్వహించడం లేదు. ఈ నెల 15వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన రాష్ట్రాల హోం మంత్రుల సమావేశానికి కూడా ఆమె వెళ్లలేదు. దీంతో సబితా ఇంద్రారెడ్డి శాఖను మార్చకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించి, విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె శాఖను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. హోం వంటి మంత్రిత్వ శాఖలో మంత్రి ఫైళ్లను దినసరి ప్రాతిపదికపై పరిశీలించాల్సి ఉంటుంది. దాంతో మార్పు తప్పదనే మాట వినిపిస్తోంది.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

హోంశాఖపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కన్నేసినట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్టానం వద్ద హోం శాఖను తనకు అప్పగించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పొసగకపోవడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయి.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

ఉప ముఖ్యమంత్రిగా హోం శాఖ తనకు దక్కాలని దామోదర రాజనర్సింహ చాలా రోజుల నుంచి ఆశిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి శాఖను మారిస్తే హోంశాఖను తనకు ఇవ్వాలని ఆయన కూడా అడుగుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడని భావించి ఉప ముఖ్యమంత్రి పదవికి తాను సహకరిస్తే తనకే దామోదర ఎదురు తిరిగారని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అందువల్ల ఆయనకు హోం శాఖ దక్కడం అంత సులభం కాకపోవచ్చు.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

ఎమ్మెల్సీగా ఉన్న డి. శ్రీనివాస్ కూడా హోంశాఖ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రి వర్గంలో చేరి హోం శాఖను చేపట్టాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్ష పదవి గానీ, హోం మంత్రి పదవి గానీ చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. సోనియా గాంధీ ఆయనకు అనుకూలంగా ఉన్నా రాహుల్ గాంధీ సుముఖంగా లేరని అంటున్నారు.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి జె. గీతారెడ్డి కూడా హోం శాఖను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆమెకు రెండు మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఓ సమయంలోనైనా ఆమెను సిబిఐ వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశం ఉంది. మరోవైపు, మెదక్ జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వకుండా గీతా రెడ్డికి ఇస్తే విమర్శలు రావచ్చు.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

ఇక సునీతా లక్ష్మారెడ్డికి హోం శాఖను అప్పగించేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. కానీ, గీతారెడ్డిని, దామోదర రాజనర్సింహను కాదని ఆమెకు ఆ శాఖను ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ప్రశ్న.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

తెలంగాణకు చెందిన శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడు. ఆయనకు అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, మహిళలకే హోం శాఖను అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

 సబిత 'హోం'పై కన్నేసిన మంత్రులు వీరే (పిక్చర్స్)

డికె అరుణకు హోం శాఖను అప్పగించే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నట్లు సమాచారం. అరుణ దూకుడుగా వ్యవహరించగలరు. పైగా, తెలంగాణకు చెందిన మహిళా మంత్రి. ఆమెకు ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+