బొత్స క్వాలిటీ మెలిక:మా చావు మేం చస్తామని కెసిఆర్

బయ్యారంలోనే ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులోనే ఉన్నాయన్నారు. బయ్యారంలో లభించి ఖనిజ నాణ్యత, పరిమాణం పూర్తిస్థాయి ఉక్కు ఉత్పత్తికి సరిపోదని బొత్స చెప్పారు. బయ్యారం గనులకు సంబంధించి తమలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. విశాఖ స్టీల్స్ జాతీయ సంపద అని చెప్పారు. పరిశ్రమకు కావాల్సిన గని, నాణ్యత లేదని చెప్పారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్సే ఇస్తుందని, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పార్టీ గౌరవిస్తుందన్నారు.
బయ్యారంలోనే పరిశ్రమ.. బలరాం నాయక్
ఉక్కు కర్మాగారం బయ్యారంలోనే నిర్మిస్తామని కేంద్రమంత్రి బలరాం నాయక్ చెప్పారు. అక్కడ ఉక్కుమాత్రమే కాకుండా స్టీల్ కూడా తయారు చేస్తామని చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం విడ్డూరమన్నారు. ఏ జివో ప్రకారం వారు ఆందోళన చేస్తున్నారో చెప్పాలన్నారు. జివో ద్వారా బయ్యారంలోనే కర్మాగారం అని మరింత స్పష్టత వస్తుందన్నారు.
బొత్స వ్యాఖ్యలపై కెసిఆర్ ఫైర్
బయ్యారం గనుల్లో నాణ్యత, పరిమాణం లేదన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై కెసిఆర్ మండిపడ్డారు. క్వాలిటీ, క్వాంటిటీ లేకుంటే మా చావు మేం చస్తామని, బయ్యారం ఖనిజాన్ని విశాఖకు తరలించడమెందుకని ప్రశ్నించారు. బొత్స తలతిక్క మాటలు సరికాదన్నారు. తెలంగాణ ప్రజలకు బొత్స వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బయ్యారంపై మహా ఉద్యమం చేస్తామని, అవసరమైతే కిరణ్ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఆంధ్రా నేతలంతా తోడు దొంగలే అన్నారు.












Click it and Unblock the Notifications