బంధువు కాదు రాబంధు: జగన్ ఎమ్మెల్యే మద్దాల

ఉప ప్రణాళిక 1972 నుండే ఉన్నదని, కొత్తగా కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు తెచ్చిందేమీ లేదన్నారు. కోరలు లేని చట్టాలు తెచ్చి దళితులకు మేలు చేస్తున్నామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ముఖ్యమంత్రి హయాంలోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో దళితులకు సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దళితుల అభివృద్ధికే ఖర్చు చేశారన్నారు.
నాపై వేటు వేయండి: గొట్టిపాటి రవికుమార్
కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాట తప్పినందువల్లే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశానని ప్రకాశం జిల్లా అద్దంకి కాంగ్రెసు రెబల్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ సోమవారం అన్నారు. ఆయన ఈ రోజు స్పీకర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం సమయంలో ఓటుపై వివరణ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడారు. తనపై వేటు వేయాలని తాను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరానని చెప్పారు. కాంగ్రెసు మాట తప్పినందువల్లే తాను వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. తాను తప్పు చేశానని భావిస్తే ప్రజలు తిరస్కరిస్తారని లేదంటే వారే తనను మళ్లీ గెలిపిస్తారన్నారు.












Click it and Unblock the Notifications