అంతే: మహేష్‌బాబును సొంతం చేసుకున్న జగన్ పార్టీ!

పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ రోజు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో షర్మిలకు ఆహ్వానం పలుకుతూ ఖమ్మం జిల్లా నేతలు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రిన్స్ మహేష్ బాబు ఫోటోలను ఉపయోగించుకున్నారు. వైయస్ జగన్, మహేష్ బాబులను పక్కపక్కనే ఉంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్, ఇవ్వాళ మహేష్ బాబు ఫోటోను వినియోగించుకోవడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
కాగా, షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లాలోని షేర్ మహమ్మద్ పేట నుంచి ప్రారంభమైంది. ఇక్కడి నుండి గండ్రాయి మీదుగా వల్లభి దగ్గర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రాత్రి అక్కడే బస చేస్తారు.












Click it and Unblock the Notifications