టి ఎంపీలకు టిడిపి తోడు!: కెసిఆర్‌కు ఎర్రబెల్లి సవాల్

అనంతరం డిఎంకె ఎంపీలు జెపిసి చైర్మన్ చాకోను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. వెంటనే తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. టిడిపి ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, పొన్నం ప్రభాకర్, రాజయ్యలు పార్లమెంటు గేటు వద్ద నిరసన తెలియజేశారు. టిడిపి ఎంపి రమేష్ రాథోడ్ కూడా నిరసన తెలిపారు. కాగా లోకసభలను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.
కెసిఆర్‌పై ఎర్రబెల్లి ధ్వజం
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం వరంగల్ జిల్లాలో నిప్పులు చెరిగారు. నోట్ల కట్టల కోమే కెసిఆర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసుతో కెసిఆర్ తెర వెనుక స్నేహం చేస్తున్నారని, ఆయన కుటుంబం పోలవరం టెండర్లలో కోట్లాది రూపాయలు దండుకుందని, ఈ వ్యవహారంపై బహిరంగ విచారణకు సిద్ధమని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.
బయ్యారం, ఓబుళాపురం, పోలవరం విషయంలో తెరాస పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని ఆరోపించారు. తెరాస వసూళ్లపై ఆధారాలు ఉన్నాయన్నారు. చర్చకు వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బయ్యారం గనులపై కెసిఆర్ ఒక్క రోజు పోరాటం చేసినట్లు నిరూపించినా రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. బయ్యారం గనులు తెలంగాణ ఆస్తి అని.. ఇనుప ఖనిజం తరలించడాన్ని అడ్డుకుంటామన్నారు. ఈ విషయంలో తెరాస డ్రామాలాడుతోందన్నారు.












Click it and Unblock the Notifications