కుటుంబ ప్రయోజనాల కోసమే: జగన్‌పై మళ్లీ ఆనం ఫైర్

రక్షణ స్టీల్స్ గనుల కేటాయింపును కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే రద్దు చేసిందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాడు గనులు కేటాయిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాటిని కిరణ్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ముఖ్యమంత్రిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల విమర్శలు సరికాదన్నారు.
ప్రస్తుతం తాము విశాఖ ప్లాంటుకు ఎంత మేరకు అవసరమో అంతే కేటాయిస్తున్నామని చెప్పారు. అనవసర విమర్శలను జగన్ పార్టీ మానుకోవాలన్నారు. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం పెట్టాలని తెలంగాణ నేతలు కోరడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. గనుల కేటాయింపుపై మంత్రుల మధ్య విభేదాల్లేవని చెప్పారు.
కాంగ్రెసు వల్ల బజారుకు... తుమ్మల
కాంగ్రెసు పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల దేశ, రాష్ట్ర పరువు ప్రతిష్టలు బజారున పడ్డాయని టిడిపి నేత తుమ్మల నాగేశ్వర రావు విజయనగరం జిల్లాలో మండిపడ్డారు. రాష్ట్రంలో బాక్సైట్, గ్రానైట్ దోపిడీలను వైయస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినా ఆయన పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications