మగాళ్లను దింపేది ఆడాళ్లే: ఎంపి కాంగ్రెసు నేత

"జబ్ తక్ మహిళా తిర్చి నజర్ సే నహీ దేఖేగీ, తబ్ తక్ పురుష్ ఉనే నహీ చేఢేగా" (పురుషుడి వైపు ఓరచూపులు చూడకపోతే పురుషుడు మహిళను వేధించడు) అని మాజీ మంత్రి సత్యదేవ్ కటారా అన్నారు. భింద్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు.
ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ వారారంభంలో కాంగ్రెసు పార్టీ భింద్ జిల్లాలో ర్యాలీని ఏర్పాటు చేసింది. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహిళ అని, అటువంటి స్థితిలో కాంగ్రెసు నాయకుడు ఆ విధమైన వ్యాఖ్య చేయడం మహిళలను కించపరచడమేనని బిజెపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే విశ్వాస్ సారంగ్ అన్నారు.
సత్యదేవ్ వ్యాఖ్య కాంగ్రెసు నాయకులు బుద్ధిని తెలియజేస్తోందని, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారి బుద్ధి బయటపడుతోందని అన్నారు. సత్యదేవ్ కటారా మధ్యప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications