అందుకే జగన్ రోశయ్యను ప్రతిపాదించారు: సోమిరెడ్డి

బ్రాహ్మణి స్టీల్స్‌కు జరిపిన భూకేటాయింపులను రద్దు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసిందని ఆయన అన్నారు. వేల ఎకరాల భూమిని వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్‌కు రాసిస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాట్లాడకుండా ఏం చేశారని ఆయన అడిగారు. రాజకీయం కోసమే బయ్యారంపై తెరాస రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. కూతురికి వైయస్ రాజశేఖర రెడ్డి లక్షా 45 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపనకు పోరాడేందుకు సీమాంధ్రులు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
బ్రాహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపును జరుపుతూ జారీ చేసిన జీవోను రద్దు చేస్తే సరిపోదని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉదని ఆయన అన్నారు. దమ్ముంటే ఆ 26 జీవోలను రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సవాల్ చేశారు.
బయ్యారం గనులు కేటాయించిన తర్వాత వైయస్ జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పచ్చి అవినీతి పార్టీ అని సోమిరెడ్డి అన్నారు. జగన్ అక్రమాస్తులకు కారణమైన 26 జీవోలను రద్దు చేస్తే తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందిస్తామని ఆయన చెప్పారు. పార్టీని బతికించుకునేందుకే తెరాస నేతలు ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications