కిడ్నాప్ కథ సుఖాంతం, మలుపులు: తల్లి క్లాస్‌మేటే

పోలీసులు వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి 8.30గంటల సమయంలో కుసుమ్ నుంచి భర్తకు వచ్చిన సెల్‌ఫోన్ కాల్ ఆధారంగా వాళ్లు ప్రయాణిస్తున్న కారు నిజామాబాద్-నాందేడ్ మార్గంలో మహరాష్ట్ర వెళుతుందని గుర్తించారు. నిజామాబాద్, నాందేడ్ పోలీసులను అప్రమత్తం చేశారు. తమ ప్రత్యేక బృందాలు కూడా అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. మహరాష్ట్రలోని జల్గాం జిల్లా చాలీస్ గావ్‌లోని ఓ హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కుసుమ్, ఇద్దరు కవల పిల్లలను రక్షించి, వారిని కిడ్నాప్ చేసిన రవిసింగ్‌ను అరెస్టు చేశారు.
ట్విస్టులు
రాజస్థాన్‌కు చెందిన రవి సింగ్ ఎయిర్‌టెల్ జోనల్ సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అహ్మదాబాద్ నుంచి ఔరంగాబాద్‌కు బదిలీ అయ్యాడు. కుసుమ, రవిసింగ్‌లు బిఏ క్లాస్‌మెట్స్. గతంలో కొన్ని సార్లు పాతబోయినపల్లిలోని కుసుమ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు.
తన సొంత కారులో వచ్చి, కుసుమ, వారి పిల్లలను అతడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అయితే రవిసింగ్ తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, తాను ఇంట్లో వేధింపులకు గురవుతున్నానని, తనను తీసుకెళ్లాలని చాలాసార్లు వేడుకుందని, అందుకే తీసుకెళ్లానని రవిసింగ్ చెబుతున్నాడు.
కుసుమ్ మాత్రం తమను రవిసింగ్ బెదిరించి, కిడ్నాప్ చేసినట్టు చెబుతున్నందున కిడ్నాప్ కేసుగా పరిగణించి విచారణ చేస్తున్నామని డిసిపి చెప్పారు. నిందితుడు చెప్పినట్టుగా కుసుమ్ అభ్యర్థన మేరకే రవిసింగ్ వచ్చినట్టు విచారణలో తేలితే కేసు సెక్షన్ల మార్పు విషయం ఆలోచిస్తామన్నారు.












Click it and Unblock the Notifications