చెల్లెలి చున్నీ లాగారు.. అన్నను బైక్‌తో ఢీకొట్టి...

ఈ నెల 19వ తేదిన అన్నాచెల్లెళ్లు అయిన దేవరపల్లి రవితేజ(25), స్వప్న(18)లు విజయవాడలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి బస్సులో రాత్రి సుమారు 12.10 గంటల సమయంలో కంకిపాడు బస్టాండుకు వచ్చారు. వాహనాలు ఏవీ లేనందున కంకిపాడు - కేసరపల్లి మార్గాన కాలినడకన బయలుదేరారు. పునాదిపాడు బిసి కాలనీలో మద్యం దుకాణం వద్దకు వచ్చేసరికి అదే గ్రామానికి చెందిన రాంప్రసాద్, వెంకన్న, వెంకటేశ్వర రావులు స్వప్న పట్ల చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారు.
ఆమె సోదరుడు రవితేడ వారిని అడ్డుకొని వాగ్వాదనికి దిగాడు. నిందితులు అతడిని ద్విచక్ర వాహనంతో వచ్చి వేగంగా ఢీకొట్టారు. కిందపడిన అతడిని కొట్టి పరారయ్యారని స్వప్న ఆరోపించారు. విషయం ఎవరికీ చెబితే చంపేస్తామని హెచ్చరించడంతో తాను మాట్లాడలేదని చెప్పారు. గాయపడిన రవితేజను విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు దీనిని రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్నారు. రవితేజ మృతి చెందడంతో ఆగ్రహానికి గురైన మృతుని బంధువులు, దళిత సంఘాల ప్రతినిధులు కంకిపాడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డు ప్రమాదం కేసును హత్య కేసుగా మార్చాలని, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్వప్న నుండి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications