క్రేజీ స్టార్టప్.. ఉద్యోగి పర్ఫార్మెన్స్ బాగోకుంటే పెయిడ్ గెట్ అవే.. ఉద్యోగాల కోసం క్యూ!
సహజంగా కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే లే ఆఫ్ లలో భాగంగా వారిని తొలగిస్తారు. కానీ ముంబై కి చెందిన ఒక చిన్న స్టార్టర్ కంపెనీ అందుకు భిన్నంగా ఆ ఉద్యోగికి పెయిడ్ లీవ్ ఇచ్చి ఆమెను ఒక అందమైన , ప్రశాంతమైన Airbnbకి పంపించి ఆమె పనితీరు మెరుగుపరుచుకునే, కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చారు.
స్టార్టప్ కంపెనీ యజమాని చేసిన పనికి ఫిదా
ఇది ఆలోచించే వారికి వింతగా ఉన్నా విపరీతమైన పని ఒత్తిడి, కుటుంబ ఒత్తిడిలో పని చేసే చాలా మంది పర్ఫార్మెన్స్ లో వెనుకబడుతున్నారు. అలాంటి వారికి కావాల్సినవి సమకూర్చి కాస్త ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు దూకుడుగా పని చేసే అవకాశం ఉంటుందని నమ్మిన కంపెనీ యజమాని చేసిన పని ఇప్పుడు అందరూ చర్చించుకునేలా చేసింది.

ఉద్యోగి పర్ఫార్మెన్స్ లో వెనుకబాటు.. ఊహించని నిర్ణయం
ముంబైకి చెందిన బ్లూ ల్యాబ్ స్టర్ మీడియా అనే కంటెంట్ ఆధారిత బి టు బి స్టార్టప్ ను నడుపుతున్న ధ్రువ్ ముఖర్జీ, అదే కంపెనీలో గత రెండున్నర సంవత్సరాలుగా నమ్మకంగా సేవలు అందిస్తున్న ఆ కంపెనీలో కంటెంట్ ఆపరేషన్స్ లీడ్ గా పనిచేస్తున్న ఆర్య ఫడ్నీస్ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆర్య ఫడ్నీస్ పూణే నుండి రిమోట్ గా పని చేస్తున్నారు.
ఉద్యోగి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు తెసుకున్న యజమాని
గత కొన్ని నెలలుగా ఆమె పనిలో నాణ్యత తగ్గడంతో పాటు, ఆలస్యం కూడా కనిపిస్తుంది. ఇక ఈ సమస్యలను గుర్తించిన ధృవ్ ఆమెతో చర్చించారు. దానికి ఆమె తన పనితీరు తగ్గడానికి బాధ్యత వహిస్తూ చేతుల్లో కొంత భాగం తగ్గించాలని పేర్కొన్నారు. అయితే ధృవ్ ఆమె పనితీరు తగ్గటానికి గల వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలనన్నింటిని తెలుసుకుని, ఆమె విషయంలో ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
ఒక అందమైన ఎయిర్ బియన్ బి లో మూడు రోజులపాటు పెయిడ్ గెట్ అవే
పూణేలోని ఒక అందమైన ఎయిర్ బియన్ బి లో మూడురోజులపాటు పెయిడ్ గెట్ అవే ఏర్పాటు చేశారు ఇందులో రెండురోజులు ఆమె ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునేలా, ఒకరోజు పూర్తి విశ్రాంతికి కేటాయించారు. అంతే కాదు ఆమెకు ఇంటికి సమీపంలో ఉన్న కో వర్కింగ్ స్పేస్ లో కూడా ఒక డెస్క్ ను బుక్ చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులన్నీ కంపెనీని భరించి ఆమెకు పనిచేయడానికి కావలసిన వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్.. కంపెనీకి ఉద్యోగాల కోసం క్యూ
దీనికి సంబంధించి ధృవ్ లింక్డిన్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పని ముగిసిన తర్వాత అవతల ఉన్న కూడా ఒక మనిషేనని గుర్తుంచుకోవాలని, విద్యార్థులు తప్పు చేస్తే, వెంటనే తొలగించడం కంటే, సానుభూతి చూపిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని ధృవ్ పేర్కొన్నారు. ఇంత గొప్పగా ఆలోచించే కంపెనీలో పని చేయటం గొప్పగా భావించి ఉద్యోగాల కోసంక్యూ కడుతున్నారు. క్రేజీ స్టార్టప్ అని తెగ పొగుడుతున్నారు. టాక్సిక్ వర్క్ కల్చర్ కు భిన్నంగా యజమాని చేసినపని ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతుంది.












Click it and Unblock the Notifications