జగన్ పార్టీ ఆఫీసుకు తాళం: కొండా సురేఖ అవుట్?

సమన్వయకర్తల నియామకం వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ విభేదాల నిపేథ్యంలో కొండా వర్గీయులు గురువారం నాడు వరంగల్ జిల్లాలో పార్టీ ఆఫీసు వద్ద మీడియాతో మాట్లాడి పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. సమన్వయ కమిటీల పేరుతో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
అనర్హులను సమన్వయ కర్తలుగా నియామించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయానికి తాళం వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాము పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారికి పార్టీ తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ ఇదే విధంగా వ్యవహరిస్తే తాము రాజీనామా చేస్తామని మహిళా ఎస్సీ, బీసీ, మైనారిటీ సెల్‌ల కన్వీనర్లు వెల్లడించారు.
తమ వర్గీయుల తిరుగుబాటు నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు పార్టీలో కొనసాగడం దుర్లభమేనని అంటున్నారు. కొండా సురేఖ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో తాజా సంఘటన ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications