భారీ అగ్ని ప్రమాదం: నలుగురు మహిళల మృతి

కోయంబత్తూర్: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లోని ఓ భవనం మూడో అంతస్థులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. వీరంతా బ్యాంక్ ఉద్యోగులు. నగరంలోని లక్ష్మీ మిల్స్ జంక్షన్ వద్ద గల విగ్నేశ్వర క్రెస్టాలోని కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకునేలోగా స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం సంభవించిన 45 నిమిషాలకు ఫైర్ టెండర్లు చేరుకున్నాయి. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు మహిళలు మూడో అంతస్థు నుంచి దాకారు. దాంతో వారు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Fire

అగ్ని ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించారని, వారిని గుర్తించాల్సి ఉందని, భవనంలో సరైన ఫైర్ ఎగ్జిట్ లేకపోవడమే ప్రమాదం తీవ్రతకు కారణమని నరం పోలీసు కమిషనర్ ఎకె విశ్వనాథన్ చెప్పారు. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. భవనంలో చిక్కుకున్నవారందరినీ సురక్షితంగా వెలికి తీశారు.

కాగా, భవనం హౌస్ కీపింగ్ డిపార్టుమెంట్ సభ్యురాలైన 40 ఏళ్ల మార్గరెట్ జాడ తెలియడం లేదు. మృతుల్లో ఆమె కూడా ఉందా అనేది తెలియడం లేదు. గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి.

Fire

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+