దద్దమ్మ కాదు దమ్మున్న లీడర్: గండ్ర, శైలజానాథ్ ఫైర్

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దద్దమ్మ కాదని దమ్మున్న నేత అని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి శుక్రవారం అన్నారు. కిరణ్‌ను దద్దమ్మ అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే తమ కార్యకర్తల ఆగ్రహాన్ని ఆయన చవి చూడాల్సి వస్తుందన్నారు. బ్రాహ్మణి కేటాయింపులు రద్దు చేయడం ఓ దమ్మున్న నిర్ణయమన్నారు.

దళితుల ఆత్మ బంధువు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దళితుల ఆత్మ బంధువు అని మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వం మంచి పని చేస్తే దానిని ఆ కోణంలోనే చూడాలన్నారు. అంతేకాని అసూయతో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఆయన చెప్పారు.

మంత్రులను తొలగించాలి

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని కళంకిత మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావును తొలగించాలని చిత్తూరు జిల్లా తిరుపతిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను కేబినెట్లో ఉంచుకొని అవినీతిపై పోరాడుతామని చెబితే ఎవరూ నమ్మరన్నారు. బయ్యారంతో పాటు సీమలోను స్టీల్ ప్లాంటు పెట్టాలన్నారు.

కౌముది కమిషన్ నివేదిక అమలు చేయాలి

ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్న హోంగార్డులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానిస్టేబుళ్లలాగే హోంగార్డులకు రూ.12వేల జీతం ఇవ్వాలన్నారు. కౌముది కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+