జగన్ భూములు రద్దు చేసే ధైర్యం ఉందా: రేవంత్

ఉక్కు లేదు, తుక్కు లేదు అని తెలిసి కూడా ఉత్తుత్తి కర్మాగారమంటూ ముఖ్యమంత్రి రాజకీయ మనుగడ సాగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పట్ల వ్యవహరించిన రీతిలోనే ముఖ్యమంత్రి కేసు నమోదు చేయించాలని ఆయన అన్నారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి రాజీనామా లేఖలను అధిష్టానం తీసుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ పదవులు కాపాడుకునేందుకు వీరు ఏకంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి, లేని సమస్యలు సృష్టించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రికి అంత ధైర్యం ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎండిగా ఉన్న సరస్వతి సిమెంట్సకు గుంటూరు జిల్లా దాచేపల్లిలో కేటాయించిన భూములను రద్దు చేయకుండా ఫైల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications