ఇంటికి పిల్చి 4గురితో అత్యాచారం చేయించిన ప్రెండ్!

నిన్న రాత్రి తనను తన స్నేహితురాలి తన ఇంటికి ఆహ్వానించిందని, అక్కడ తనకు మత్తు మందు కలిపిన పానియాన్ని ఇచ్చిందని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ఇంటిలో ఉన్న నలుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది.
ఈ ఘటన ముంబై నగరంలోని వకోలా ప్రాంతంలో జరిగింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం తరలించారు. పోలీసులు నిందితులను ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధిత బాలిక గర్ల్ ఫ్రెండ్ ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. బాధితురాలు తన ఫిర్యాదులో నలుగురు నిందితులతో పాటు తన స్నేహితురాలి పేరును కూడా పేర్కొంది.












Click it and Unblock the Notifications