కూలిన ఆస్పత్రి భవనం: శిథిలాల కింద 20 మంది?

Building Collapse
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ఆస్పత్రి భవనం కూలింది. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి కూలడంతో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద 20 మంది చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టీవీ కథనాల ప్రకారం - 10 మంది రక్షించారు. నిర్మాణంలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆస్పత్రిలో మహిళా విభాగం కూలింది. వివరాలు అందాల్సి ఉంది. నలుగురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిని ఖాళీ చేయించారు. గాయపడిన రోగులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. కూలిన భవనం దశాబ్దాల కాలం నాటిది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదం ఎలా సంభవించిందనేది చూస్తామని ఆస్పత్రి అధికార వర్గాలంటున్నాయి.

ఆస్పత్రి భవనం పైకప్పు అకస్మాత్తుగా కూలిందని, కూలుతుందనే అనుమానం ఏ మాత్రం కలగలేదని అంటున్నారు. సహాయక చర్యలకు సైన్యం కూడా దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడంలో స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఈ ఆస్పత్రి ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నడుపుతోంది. ఇది భోపాల్‌లోని ఫతేఘర్‌లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+