సర్వే చిత్రం: కాంగ్రెస్ గెలుపు, సిఎంగా కుమారస్వామి

దీని ప్రకారం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 117-129 మధ్య సీట్లు దక్కనున్నట్లు అంచనా. ప్రస్తుతం ఆ పార్టీ బలం 71. ఇక ప్రస్తుతం 104 స్థానాలతో అధికారం చలాయిస్తున్న బిజెపి ఈసారి పూర్తిగా పట్టు కోల్పోనున్నట్లు తేలింది. దానికి 39 - 49 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. పార్టీలో తిరుగుబాట్లే బిజెపి పథనానికి కారణంగా నిలుస్తున్నాయి.
మరోవైపు జెడిఎస్‌కు 34-44 సీట్లు, బిజెపి తిరుగుబాటు నేత యడ్యూరప్పకు చెందిన కర్ణాటక జనతా పార్టీ(కెజెపి)కి 14-22 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 37శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా. ఇక బిజెపి ఓట్ల శాతం 23 శాతానికి పడిపోతుందని సర్వేలో తేలింది. కెజెపికి 7శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి విషయంలో మాత్రం కర్ణాటక ఓటర్లు కుమారస్వామికే ఓటేశారు. 18శాతం మంది ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. 10 శాతం ఓట్లతో యడ్యూరప్ప రెండో స్థానంలో, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య 9 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఆరోస్థానంలో ఉన్నారు. ఆయనకు కేవలం ఆరుశాతం మంది ఓటర్లు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications