కిరణ్‌కు దూరం దూరం: శ్రీలంకకు డిసిఎం దామోదర

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం మెదక్ జిల్లాలో జరిగే ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో పాల్గొనట్లేదని రాజనరసింహ స్పష్టం చేసిన విషయం విదితమే. ఆయన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ద్వారా ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేశారు.
బొత్సకు కూడా రాజనర్సింహ అందుబాటులోకి రాలేదు. శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న బొత్సతో ఇదే విషయమై మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. మెదక్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై సమావేశం జరుగుతున్న సమయంలో రాజనర్సింహ హాజరుకాకుంటే బాగుండదని, ఆయనతో మాట్లాడాలని కోరారు. మెదక్ డిసిసి అధ్యక్షుడు భూపాల్ రెడ్డి కూడా బొత్సకు ఇదే విషయాన్ని వివరించారు.
రాజనర్సింహతో భేటీ అయ్యారు. 29న మెదక్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజనర్సింహ అంగీకరించలేదు. పైగా.. శుక్రవారం రాత్రి వరకూ రాజనరసింహ హాంకాంగ్ వెళ్తారంటూ సన్నిహిత వర్గాలు చెబుతూ వచ్చాయి. తాజాగా.. ఆదివారం ఆయన చెన్నై వెళ్లి అక్కడి నుంచి కొలంబోకు ప్రయాణం కానున్నారని ఆ వర్గాలు ద్రువీకరించాయి.












Click it and Unblock the Notifications