లెక్చరర్‌గా పని చేస్తా!: సిబిఐ జెడి, బ్రేకింగ్ న్యూస్‌పైనా..

Laxmi Narayana
ఏలూరు: సమాజానికి ఉపయోగపడే విషయాలపై మీడియా దృష్టి సారించాలని, బ్రేకింగ్ వార్తలపై కాదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ ఆదివారం అభిప్రాయపడ్డారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. నేడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా శక్తిమంతంగా ఉన్నాయని, కేవలం బ్రేకింగ్ వార్తలకే ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచించారు.

రాబోయే కాలంలో అవినీతిరహిత సమాజం ఏర్పడితే సిబిఐ, పోలీసు శాఖల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఆయన ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం సూర్యనందన అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.

విద్యార్థులు లక్ష్యం దిశగా పయనించాలన్నారు. ప్రపంచానికి సంస్కృతికి, సాంప్రదాయం నేర్పిన భారత దేశం ప్రస్తుతం సంస్కృతి, సాంప్రదాయం నేర్చుకునే స్థితిలో ఉందన్నారు. మీడియా మంచినే పోత్సహించే విధంగా ఉండాలన్నారు. అవినీతి రహిత సమాజం ఏర్పడితే సిబిఐ పదవి వదిలి లెక్చరర్‌గా పని చేస్తానన్నారు.

అనంతరం లక్ష్మీ నారాయణ కుటుంబ సమేతంగా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి విశేష పూజలు చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+