వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాట్‌పై గాలి X శైలజానాథ్: హరికృష్ణపై టిడిపి వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukirshnama Naidu - Sailajanath
హైదరాబాద్: వస్త్రాలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను తొలగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారీగా ముడుపులు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం ఆరోపించారు. మంత్రుల బృందంతో కలిసి ఆన భారీ అవినీతికి పాల్పడ్డారని, వస్త్రాలపై వ్యాట్ తొలగింపునకు సంబధించి రూ.75 కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి సోదరులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సిఎం తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నారని, మరో సోదరుడు సంతోష్ కుమార్ రెడ్డి హైదరాబాదు నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగులో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు.

వ్యాట్ ఎత్తివేయాలంటు ప్రతిపక్షాలు ఆందోళన చేసినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేయలేదని ఇప్పుడు మాత్రం ఎందుకు ఎత్తివేసిందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ముడుపులు తీసుకున్నారని అందుకే ఇప్పుడు ఎత్తివేశారన్నారు. హరికృష్ణ, కడియం శ్రీహరి, దాడి వీరభద్ర రావులు విశాఖ పాదయాత్ర ముగింపు సభకు రాకపోవడానికి వేరే కారణాలు లేవని, వారు తమ తమ వ్యక్తిగత పనుల వల్లే రాలేక పోయారని చెప్పారు.

అయితే గాలి వ్యాఖ్యలను మంత్రి శైలజానాథ్ తీవ్రంగా ఖండించారు. వ్యాట్ రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, ఆయన వ్యాపారులతో ఒప్పందం పెట్టుకోవడం వల్లే ఎత్తివేశారా అని ప్రశ్నించారు. ఆయన ఏ ఒప్పందం పెట్టుకొని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టే గాలి మాటలకు విలువ లేదన్నారు.

English summary
Telugudesam Party senior leader alleged that CM Kiran Kumar Reddy has taken bribe for cancel VAT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X