కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్: బావ అప్పుకు బావమర్ది కిడ్నాప్

మరోవైపు ఈ కేసులో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు నేరుగా ఉన్నప్పటికీ పరోక్షంగా మరికొందరికి సంబంధాలు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వీరు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వరుసగా కిడ్నాప్‌లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బావ అప్పు చేశాడని బావమర్ది కిడ్నాప్!
తూర్పు గోదావరి జిల్లాలో ఓ బావ అప్పు చేశాడని ఆరోపిస్తూ ఓ ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన సంఘటన జరిగింది. జ్యోతుల రాము అనే విద్యార్థిని ఆయన బావ అప్పు చేశాడని ఫైనాన్షియర్లు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన కాకినాడ ఆసుపత్రి సమీపంలో జరిగింది. కుటుంబ సభ్యులు ఫైనాన్షియర్ పైన ఫిర్యాదు చేశారు.
విద్యార్థినిపై అత్యాచారం
రాజమండ్రి సమీపంలో ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులు దుశ్చర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రేమ వేధింపులతో ఆత్మహత్య
నల్గొండ జిల్లాలోని హైదలాపురంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి ఆమె పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
హైదరాబాదులో కారు బీభత్సం
హైదరాబాదులోని రాజేంద్రనగర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు ద్విచక్ర వాహనాలను ఢీకొని పాదచారులపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ పరారయ్యాడు.












Click it and Unblock the Notifications