ఉరి వ్యాఖ్యల హీట్: ఆనంకు జగన్ పార్టీ లీగల్ నోటీసులు

జగన్ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆనం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఆనం రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల పరువుకు భంగం కలిగించేలా నీచాతి నీచమైన, నేర ప్రవృత్తితో కూడిన నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ద్రోహబుద్ధితో ఆరోపణలు చేసి మంత్రివర్గానికే కళంకం తెచ్చిన ఆనంకు మంత్రిగా కొనసాగే అర్హతలేదని దుయ్యబట్టారు. మంత్రి హోదాను దుర్వినియోగం చేసినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించాలని, లేకుంటే ఈ అంశంపై గవర్నర్ జోక్యం చేసుకొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ కేసు న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశమని, కేసులో దర్యాప్తు కూడా ఇంకా పూర్తికాలేదని జనక్ ప్రసాద్ గుర్తుచేశారు.
అయితే బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్న ఆనం అప్పుడే ఈ కేసులో తీర్పు చెప్పేలా మాట్లాడారని, జగన్‌ను ఉరి తీసినా తప్పులేదంటూ న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు యత్నించారని జనక్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్నారు. చట్టాన్ని పక్కన పెడితే, మొదటి ఉరి జగన్‌కేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ధిక్కరణ కిందకు వస్తాయని అన్నారు.
జగన్ ఎలాంటి తప్పు చేయకపోయినా కాంగ్రెస్‌ను ఎదిరించారనే కారణంతో కుట్ర చేసి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని, కోర్టులో కేసు విచారణలో ఉండగా మంత్రి ఆనం తీర్పు చెప్పే విధంగా మాట్లాడటం ప్రజాద్రోహమని, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారం మాట్లాడుతూ కోర్టులను ప్రభావితం చేసి జడ్జిమెంట్‌ను అనుకూలంగా, జగన్‌కు వ్యతిరేకంగా ఇప్పించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 26 జివోలు చట్ట ప్రకారమే వెలువడ్డాయని కిరణ్ చెబుతుంటే ఆ జివోలు చట్ట ప్రకారమే అయితే నేరం ఎక్కడిది? జగన్ పైన ఎలా ఆరోపణలు చేస్తారన్నారు. చంచల్‌గూడ జైలును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆనం చెప్పడాన్ని తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications