ప్రియుడి తిరస్కరణ: బిపివో ఉద్యోగిని ఆత్మహత్యయత్నం

 BPO employee attempts suicide
హైదరాబాద్: పెళ్లికి ప్రియుడు తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన ఓ బిపివో ఉద్యోగిని ఆత్మహత్యా యత్నానికి దిగింది. ఆదివారంనాడు ఈ సంఘటన సికింద్రాబాదులో జరిగింది. సికింద్రాబాదులోని మారేడుపల్లికి చెందిన 22 ఏళ్ల అమ్మాయి గత రెండేళ్లుగా తన మాజీ సహోద్యోగిని ప్రేమిస్తోంది.

కొన్ని నెలల క్రితం అమ్మాయి కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఆమె అభ్యంతర పెట్టినా వారు వినలేదు. దాంతో ఆదివారం సాయంత్రం అమ్మాయి నిద్ర మాత్రలు కొన్ని మింగి తన ప్రియుడిని కలుసుకోవడానికి వెళ్లింది. సికింద్రాబాదులోని వైఎంసిఎ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరువురు కలుసుకున్నారు.

తనను పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అతన్ని అడిగింది. అతను అందుకు నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఆమె మరికొన్ని నిద్ర మాత్రలు మింగి, ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ ఆమెను మహంకాళి పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి పోలీసులకు విషయం చెప్పాడు.

పోలీసులు వెంటనే అమ్మాయిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే, కేసు మాత్రం ఇంకా నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు.

భవనంపై నుంచి గృహిణి ఆత్మహత్య

వ్యాధి కారణంగా కళ్లు మంటలు పుట్టడంతో భరింలేక 48 ఏళ్ల మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్‌లో ఆదివారంనాడు చోటు చేసుకుంది. మృతురాలినని చందానగర్‌లోని తారానగర్‌లో నివసిస్తున్న ప్రసాద్ భార్య సంధ్యాదేవిగా గుర్తించారు.

సంధ్య తమ ఇంటికి దగ్గరలో ఉన్న రెండతస్థుల భవనంపైకి ఎక్కి టెర్రాస్ నుంచి కిందికి దూకింది. సంధ్య తీవ్రమైన కళ్ల వ్యాధితో బాధపడుతోంది. శనివారంనాడు కూడా ఆమె ఓసారి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆమె వదిన ఆమెను అడ్డుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+