తీవ్ర కాలు నొప్పి: షర్మిల పాదయాత్రకు మరోరోజు బ్రేక్

అయితే, ఈ రోజు ఆమెను పరిశీలించిన వైద్యులు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో మంగళవారం కూడా ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో వరుసగా రెండో రోజు షర్మిల పాదయాత్ర రద్దు కానుంది. కాగా, ఆదివారం ఖమ్మం జిల్లాలోని బూడిదపాడులో సభ ముగించుకొని పవర్ గ్రిడ్ వద్ద మధ్యాహ్నం బస చేసేందుకు వెళ్తుంగా అక్కడ షర్మిల కాలు జారి బెణికింది.
సాయంత్రం వరకు అక్కడే విశ్రాంతి తీసుకొని ,షర్మిల తిరిగి కామేపల్లి మండలం ముచ్చర్లకి పాదయాత్ర నిర్వహించారు. అక్కడ బంజారాలతో కలిసి నృత్యం చేసే సమయంలో కాలు నొప్పి మరింత తీవ్రమైంది. దీంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఓ రోజు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
కాలు నొప్పి కారణంగా షర్మిల పాదయాత్ర సోమవారం రద్దయినట్లు పార్టీ నేతలు ప్రకటించారు. మంగళవారం నుండి యథాతథంగా ఉంటుందని చెప్పారు. కానీ, ఈ రోజు మరోసారి పరీక్షించిన వైద్యులు మరో రోజు విశ్రాంతి తీసుకోవాలని షర్మిలకు సూచించారు.












Click it and Unblock the Notifications