బేగంపేటలో అత్యవసరంగా అద్వానీ ఫ్లైట్ ల్యాండింగ్

LK Advani
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్‌కె అద్వానీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా సోమవారం సాయంత్రం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో దిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో దించారు. విమానంలో ఇంధన సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ తిరిగి వెళ్తుండగా అద్వానీ విమానం బేగంపేటలో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన కర్ణాటక శానససభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంధన సమస్య తలెత్తడంతో అద్వానీ విమానం బేగంపేట విమానాశ్రయంలో దిగింది. దాంతో అద్వానీ దాదాపు గంటన్నర పాటు బేగంపేట విమానాశ్రయంలో ఆగిపోయారు.

విమానం కదలడం కష్టమని చెప్పడంతో అద్వానీని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ఆయన కర్ణాటక రాజధాని బెంగళూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే.

అద్వానీ విమానం అత్యవసరంగా బేగంపేట విమానాశ్రయంలో దిగడానికి గల మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+