టి ఎఫెక్ట్: కాంగ్ ఎంపీలకి సుష్మ అండ, జెఏసిలోకి ఎన్సీపి

మరోవైపు కాంగ్రెసు దీనిపై నాన్చుతోంది. కాంగ్రెసు నాన్చుడు ధోరణిని వ్యతిరేకిస్తూ, తెలంగాణను వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశాలు జరిగినప్పుడల్లా పార్లమెంటులో ఆందోళన చేయడం, పార్లమెంటు గేటు వద్ద నిరసన వ్యక్తం చేయడం చేస్తుంటారు.
ఈ రోజు కూడా వారు పార్లమెంటు మొదటి గేటు వద్ద తెలంగాణ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. వారి నిరసనకు బిజెపి, తెరాస నేతలు మద్దతు తెలిపారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ వారి వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. వారిని పరామర్శించారు. తాము మంగళవారం సభలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతామని వారికి చెప్పారు.
తెలంగాణ జెఏసిలోకి ఎన్సీపి
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితిలోకి తమ పార్టీ చేరుతున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) నేత త్రిపాఠి ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద ఐకాస చేస్తున్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు త్రిపాఠి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జెఏసిలో తమ పార్టీ చేరుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ కోసం ఎన్సీపి పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications