ఢిల్లీలో జెఏసి తెలంగాణ: పార్లమెంట్ గేట్ వద్ద టిఎంపీలు

బిజెపి నేతలు ప్రకాష్ జవదేకర్, ఎపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి, లెఫ్ట్ నేతలు గుండా మల్లేష్, చాడ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణపై అధికార కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణపై తేల్చాలని డిమాండ్ చేశారు. వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు.
ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ... బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ప్రజలు క్షమించరన్నారు. కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందే అన్నారు.
పార్లమెంటు గేటు వద్ద ఎంపీలు
మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు గేటు 1 వద్ద తెలంగాణ కోసం ఆందోళన చేపట్టారు. కాంగ్రెసు పార్టీ తెలంగణపై తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. అప్పటిదాకా తాము తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ ఆందోళనలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, మంద జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. వారికి భాజపా, తెరాస మద్దతు పలికింది.
ప్రధాని రాజీనామాకు డిమాండ్
ఇంకోవైపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని లోకసభ, రాజ్యసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభను చైర్మన్ రెండు గంటల వరకు వాయిదా వేశారు. లోకసభలో విపక్షాలు పట్టు వీడక పోవడంతో స్పీకర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అన్ని పార్టీలను కోరారు.












Click it and Unblock the Notifications