జగన్ కేసు: లాయర్‌పై నిమ్మగడ్డ ప్రసాద్ భార్య ఆగ్రహం

విచారణ సందర్భంగా నిమ్మగడ్డ ప్రసాద్ సతీమణి ఆశా ప్రసాద్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సిబిఐ తరఫు లాయరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. లాయరు వాదనలు వినిపిస్తుండగా పలుమార్లు ఆమె సమాధానం చెప్పే ప్రయత్నాలు చేశారట. సిబిఐ వాదన తప్పని చెప్పే ప్రయత్నాలు చేశారట. సిబిఐ ఎస్పీ వెంకటేష్‌తో మాట్లాడిన ఆమె నిమ్మగడ్డ బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగారు. అయితే తాము చట్టబద్దంగానే వెళ్తున్నామని వెంకటేష్ సమాధానం చెప్పారు.
విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ రేపు
జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి కూతురు పెళ్లి మే 26వ తేదిన ఉందని న్యాయవాది రామచంద్రన్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వేసవి సెలవుల తర్వాత విజయ సాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను విచారించాలని సాయి తరఫు న్యాయవాది కోరారు. అలా అయితే కేసు మరింత జాప్యమవుతుందని, ఈ కేసులో ప్రధాన సూత్రదారి విజయ సాయి రెడ్డి అని, ఆయన బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సిబిఐ తరఫు న్యాయవాది అన్నారు. రేపు విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications